కరోనా కల్లోలం బాలీవుడ్ లేదు టాలీవుడ్ లేదు ఏ భాషా హీరోలని వదలడం లేదు. హీరోయిన్స్, హీరోలు కరోనాకి అతీతులు కారు అన్నట్టుగా చాలామంది ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకోగా.. అదే ఫ్యామిలిలో చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. ఇక రామ్ చరణ్ వ్యానిటి డ్రైవర్ కరోనాతో చనిపోవడంతో ప్రస్తుతం చరణ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మరోపక్క మహేష్ స్టైలిస్ట్ కి కరోనా సోకడంతో డాక్టర్స్ సలహా మేరకు మహేష్ ఫ్యామిలీ మొత్తం హోమ్ ఐసోలేషన్ కి వెళ్లారు. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో టెక్నీకల్ సిబ్బందికి కరోనా రావడంతో అటు ఎన్టీఆర్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కి బ్రేకులు వేశారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడట. ఇక రవితేజ కూడా ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మకి కరోనా సోకడంతో ప్రస్తుతం రవితేజ కూడా తన ఇంట్లోనే రూమ్ కి పరిమితమయ్యాడట. ఇక చిరు కూడా ఆచార్య షూటింగ్ ఆపేసి ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఇలా స్టార్ హీరోలు తమ ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి కరోనా కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు తగ్గి.. ఎప్పుడు నార్మల్ స్టేజ్ కి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.