జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతమంది కమెడియన్స్ ని వెండితెరకు పరిచయం చేసిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కామెడీ షో లో చిన్న పాత్ర దొరికితే చాలు ఫెమస్ అవ్వొచ్చు.. తద్వారా సెలెబ్రిటీ హోదా వచ్చేస్తుంది. అలా వచ్చిన వాళ్లలో చాలామంది వెండితెర మీద హీరోలు అదృష్టం పరిక్షించుకుంటుంటే.. మరికొందరు డైరెక్టర్స్ అవతారం ఎత్తుతున్నారు. అలాగే కొంతమంది పలు షోస్ లో బిజీగా మారుతూ డేట్ కూడా అడ్జెస్ట్ చెయ్యలేని స్టేజ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లో ఓ పాపులర్ కమెడియన్ జబర్దస్ షో, ఇతర షోస్ కోసం ఏకంగా గవెర్నెమెంట్ జాబ్ వదిలేసాడనే విషయం తెలిసి కామెడీ ప్రియులు షాకవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే మాములు విషయం కాదు.. ఏళ్ళ తరబడి తపస్సు చేసినా కొంతమందికి ఆ అదృష్టము దక్కదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కెరీర్ సెటిల్ అని ఫీలయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి జాబ్ వదిలేసి జబర్దస్త్ కోసం వచ్చాడంటే నిజంగా ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అతనెవరో కాదు.. పటాస్ నుండి జబర్దస్త్ లోకి దూసుకొచ్చిన నూకరాజు. జిగేల్ జీవం స్కిట్ లో పరిచయం అయిన నూకరాజు. ఇప్పుడు ఏ కామెడీ షో చేసినా.. అందులో అతనుండాల్సిందే. అతని పంచ్ లుండాల్సిందే. అంతలా నూకరాజు ఫెమస్ అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ తో ఫుల్ బిజీ నూకరాజు.
ఓ ఇంటర్వ్యూలో నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవాడివి అంటే.. పవర్ ప్లాంట్ లో పర్మినెంట్ జాబ్ చేసేవాడిని ని చెప్పి షాకిచ్చాడు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగం వదిలేసినందుకు తిట్టారని.. ప్యాషన్ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసేంత యిష్టం ఉందని చెబుతున్నాడు. జాబ్ కి సెలవు పెట్టి షోస్ చేసి పాపులర్ అవడంతో.. కమిట్ అయిన షోస్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు చెబుతున్నాడు ఈ కమెడియన్ నూకరాజు.