Advertisementt

పవన్ మాటిచ్చాడంటే..

Thu 22nd Apr 2021 08:16 PM
pawan kalyan,vakeel saab movie,dil raju,collaborate again  పవన్ మాటిచ్చాడంటే..
Pawan - Dil Raju combo again పవన్ మాటిచ్చాడంటే..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కలని 22 ఏళ్ళకి సాకారం చేసుకున్న దిల్ రాజు.. వకీల్ సాబ్ సక్సెస్ తో తెగ సంబరపడిపోతున్నారు. ఏపీ, తెలంగాణాలో కరోనా ఉన్నప్పటికీ, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద థియేటర్స్ నడిచినా వకీల్ సాబ్ కలెక్షన్స్ దిల్ రాజుని సంతోష పెట్టాయి. పవన్ కళ్యాణ్ అంటే దిల్ రాజు ఎందుకంత ఇదైపోతున్నాడంటే.. పవన్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి ముందు దిల్ రాజుని పిలిచి సినిమా ఆడితే ఓకె.. లేదంటే డబ్బులు నేను సర్దుబాటు చేస్తాను.. అలాగే మరో సినిమా మీ బ్యానర్ లో చేస్తానని చెప్పడంతోనే దిల్ రాజు.. పవన్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంతలా పొగిడేసి ఎమోషనల్ అయ్యాడట.

పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతోనే ఆయనికి ఎవరూ ఇవ్వని పారితోషకం ఇచ్చాడు దిల్ రాజు. ఆయన మీద ఇష్టం, నమ్మకం అన్ని కలిపి పవన్ కి దిల్ రాజు 50 కోట్ల పారితోషకం ఇచ్చేసాడటని టాక్ ఉంది. మరి ఇలాంటి నిర్మాతని నేనూ ఎప్పుడు చూడలేదని పవన్ చెప్పాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తన బ్యానర్ లో మరో సినిమా చెయ్యడానికి దిల్ రాజు ఒప్పించాడనే టాక్ కూడా నడుస్తుంది. అంటే పవన్ - దిల్ రాజు కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుంది... పవన్ మైత్రి మూవీస్ బ్యానర్ లో, బండ్ల బ్యానర్ లో సినిమాలు చేసాక దిల్ రాజుకి సినిమా చేస్తాడేమో చూద్దాం. ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరు చేస్తారో.

Pawan - Dil Raju combo again:

Pawan Kalyan – Dil Raju to collaborate again

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ