Advertisementt

హరీష్ - పవన్ సినిమాలో బిగ్ ట్విస్ట్

Thu 22nd Apr 2021 02:45 PM
pawan - harish combo movie,harish shankar,pawan kalyan,pspk28  హరీష్ - పవన్ సినిమాలో బిగ్ ట్విస్ట్
Big Twist in Pawan - Harish Movie Story హరీష్ - పవన్ సినిమాలో బిగ్ ట్విస్ట్
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా మొదలు పెట్టకముందే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ - హరీష్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ చూసాక వాళ్ళ కాంబో పై అంచనాలు పెరక్కపోవడమా.. అయితే ఇప్పుడు హరీష్ - పవన్ కళ్యాణ్ సినిమా బ్యాక్ డ్రాప్ పై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయ్. హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ని ఓ పోలీస్ ఆఫీసర్ గాను, అలాగే ఓ లెక్చరర్ గాను డిజైన్ చేసాడట. అంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన మిరపకాయ్ సినిమాలో రవితేజ అండర్ కవర్ మాఫియా ని పట్టుకోవడానికి  లెక్చరర్ అవతారమెత్తినట్టు.

అలాగే గబ్బర్ సింగ్ స్టయిల్లో పవన్ ని పవర్ ఫుల్ ఆఫీసర్ గాను చూపించబోతున్నాడట. హరీష్ శంకర్ దర్సకత్వంలో వచ్చిన, మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాల హీరోల కేరెక్టర్స్ ని ఇప్పుడు పవన్ సినిమా కోసం హరీష్ వాడేస్తున్నాడన్నమాట. తన సినిమాల స్టయిల్ నే మళ్ళీ హరీష్ ఫాలో అవుతాడని తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ హరీష్ మూవీలో డ్యూయ‌ల్ రోల్ పోషించ‌బోతున్న‌ట్టు టాక్‌. ప‌వ‌న్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ప‌వ‌న్ లెక్చ‌ల‌ర్ గా క‌నిపిస్తే.. సెకండ్ హాఫ్ లో.. పోలీస్ అవ‌తావ‌రం ఎత్తుతాడ‌ని టాక్‌. లెక్చరర్, పోలీస్ ఆఫీసర్ గా పవన్ చేసే కామెడీ సినిమాకి హైలెట్ గా ఉంటుందట. మరి ఇది విన్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగుతారా.

Big Twist in Pawan - Harish Movie Story:

Pawan Kalyan interesting role in Harish Shankar film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ