బాలీవుడ్ లో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ - దిశా పటాని జంటగా తెరకెక్కిన సల్మాన్ ఖాన్ రాధే మూవీ మే 13 రంజాన్ కి విడుదల చేస్తున్నట్టుగా గతంలో డేట్ ప్రకటించినా.. కోవిడ్ కారణంగా రాధే సినిమాని వచ్చే ఈద్ కి డేట్ మారినా మారొచ్చని సల్మాన్ అన్నప్పటినుండి ఆయన ఫాన్స్ లో ఆందోళన కనిపిస్తుంది. సల్మాన్ రాధే పై బాలీవుడ్ భారీ అంచనాలున్నాయి. సల్మాన్ ప్లాప్ రికార్డ్స్ ఎలా ఉన్నా ఈద్ కి వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టుకుపోవడం సల్మాన్ స్టయిల్. ఇక రాధే సినిమా రిలీజ్ సంగతి పక్కనబెట్టి.. ప్రస్తుతం రాధే ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాధే మూవీ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
సల్మాన్ ఖాన్ యాక్షన్, దిశా పటాని అందాలు, కత్రినా స్పెషల్ సాంగ్ అన్ని సినిమాకి ఆకర్షణలు గా నిలుస్తున్నాయి. ముంబై లో వెళ్లానుకుని ఉన్న డ్రగ్ మాఫియా ఆట కట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ గా సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు. రణదీప్ హుడా విలన్ గా, సల్మాన్ ఖాన్ హీరోయిజమ్ తో ఫుల్లీ యాక్షన్ ప్యాకెడ్ గా కనిపిస్తుంది రాధే. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ ఏమిటి అంటే సల్మాన్ ఖాన్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డాన్స్ ని ఫాలో అవడమే కాదు.. ఆయన నటించిన డీజే సాంగ్ సీటీ మార్ సాంగ్ ని దిశా పటాని తో కలిసి ఇరగదీసాడు. అయితే ఫుల్ సాంగ్ చూస్తేనే కానీ అల్లు అర్జున్ ని సల్మాన్ ఖాన్ మ్యాచ్ చేసాడో.. లేదో.. తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ డాన్స్ స్టయిల్ అలాంటిది. ఇప్పటికేబాలీవుడ్ హీరోలంతా అల్లు అర్జున్ డాన్స్ కి సలాం కొడుతుంటే.. సల్మాన్ ఏకంగా డాన్స్ నే కాపీ కొట్టేసాడు.
ఎలాగూ రాధే మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ కూడా వన్ అఫ్ ద పార్ట్ కాబట్టి ఈ సీటిమార్ సాంగ్ హిందీలో కూడా పాపులర్ అవడం మాత్రం ఖాయం. మరి ప్రభుదేవా - సల్మాన్ ఖాన్ కాంబో లో ఇప్పటికే రెండు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ రాధే మూడో మూవీ. ఈద్ కి రాధే మూవీ సల్మాన్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.