సుకుమార్ దర్శకత్వంలో రంగమ్మత్తగా రంగస్థలంలో అదరగొట్టిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. సుకుమార్ నెక్స్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప లోను నటించబోతుంది అనే న్యూస్ పుష్ప సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి జరుగుతున్నా అటు చిత్ర బృందం కానీ ఇటు అనసూయ కానీ క్లారిటీ ఇవ్వలేదు. రంగమ్మత్త గా అనసూయ ని రంగస్థలంలో అద్భుతంగా నటించిన అనసూయకి పుష్ప సినిమాలో బందిపోటు రాణి లాంటి పాత్రని సుకుమార్ డిజైన్ చేసాడనే ప్రచారం జరిగింది. అయితే అనసూయ పుష్ప సినిమాలో నటిస్తుంది అనేది కన్ ఫమ్ అయ్యింది.
అనసూయ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తాను పుష్ప షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా ట్వీట్ చెయ్యడంతో పుష్ప మూవీ లో అనసూయ నటిస్తుంది అనేది స్పష్టత వచ్చింది. అయితే ఆ పాత్ర ఏమిటి అనేది రివీల్ అవ్వలేదు. అల్లు అర్జున్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా టీజర్ తోనే సినిమాపై బాగా అంచనాలు సెట్ చేసారు సుక్కు అండ్ బన్నీ లు. అల్లు అర్జున్ మాసివ్ లుక్, సుకుమార్ మేకింగ్ స్టయిల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించడం ఇవన్నీ పుష్ప పై అంచనాలు, ఆసక్తి పెంచుతున్నాయి.