ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ జోరు ఎలా ఉంది అంటే.. రేపో మాపో రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ చేసేస్తున్న ప్రభాస్.. ఆదిపురుష్ షూటింగ్ అప్పుడే 30 పర్సెంట్ కంప్లీట్ చేసేసి ఫాన్స్ కి పిచ్చ షాక్ ఇచ్చాడు. మరోపక్క ప్రశాంత్ నీల్ తో సలార్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసాడు. వరస పాన్ ఇండియా మూవీస్ తో ప్రభాస్ చాలా దూకుడు మీదున్నాడు. ప్రభాస్ తో పని చేసే దర్శకులు మరింత స్పీడుగా ఉన్నారు. కాబట్టే ఆయా సినిమాల ప్రోగ్రెస్ అలా ఉన్నాయి. ఇక రేపు శ్రీరామనవమికి ఆదిపురుష్ నుండి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది టీం. మరోపక్క ప్రశాంత్ నీల్ సలార్ కి సంబందించిన షూటింగ్ కోసం సెట్ వేసే పనిలో బిజీగా వున్నాడు.
ఒక పక్క కెజిఎఫ్ 2 మరోపక్క సలార్ పనుల్లతో ప్రశాంత్ నీల్ తలమునకలై ఉన్నాడు. ప్రభాస్ డేట్స్ ని పక్కాగా వాడాలి అంటే సలార్ కోసం సెట్ల నిర్మాణం అన్నీ పక్కాగా ఉండాలని.. అందుకే ప్రశాంత్ నీల్ సలార్ కోసం ఓ సెట్ హైదరాబాద్ లో వేస్తె మరో సెట్ గుజరాత్ లో వేయించాడట. వచ్చే నెలలో హైదరాబాద్ సెట్ లో సలార్ షూటింగ్ చేస్తే.. ఆ తర్వాత షెడ్యూల్ గుజరాత్ లో చేస్తాడట. ఆ రెండు సెట్స్ కూడా భారీగా నిర్మితమయ్యాయట. సెట్స్ నిర్మాణం ప్రశాంత్ నీల్ దగ్గరుండి చూసుకుంటున్నాడని సమాచారం. తాజాగా సలార్ సెట్ నుండి బయటికి వచ్చిన పిక్ లో ప్రభాస్ మాస్ గా డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించబోయే శృతి హాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది.