కరోనా కారణంగా సినిమా థియేటర్స్ మూతబడ్డాయి. అలాగే చాలా సినిమాల షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య, సర్కారు వారి పాట షూటింగ్స్ ఆగినట్లుగా వార్తలొస్తున్నాయి. కరోనా నిబంధనల మేర షూటింగ్స్ చేసుకుంటున్నా.. సెట్ లో కరోనా సోకితే అర్ధాంతరంగా షూటింగ్ కి బ్రేకులు వేసి టీం మొత్తం ఐసోలేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. మరోపక్క సినిమాలు మీద సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉన్నా అన్ని జాగ్రత్తల నడుమ తమ షూటింగ్ ఆగేదే లే అంటున్నాడు పుష్ప రాజ్. నిన్నటివరకు తగ్గేదే లే అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్ - సుకుమార్ లు ఇప్పుడు షూటింగ్ ఆపేదే లే అంటున్నారు.
పుష్ప షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడుతుంది అని.. అందు వల్ల సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని అందరూ అనుకుంటుంటే.. సుక్కు - బన్నీ లు మాత్రం షూటింగ్ ఆపేదే లే అంటూ గర్జిస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది కరోనా వలన చాలా టైం వెస్ట్ అయ్యింది.. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ఆపడం కుదరదని, కరోనా కట్టడి చేస్తూనే షూటింగ్ చేస్తామని ధీమాతో ఉన్నారు. ఇక మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ రీసెంట్ గానే పుష్ప సెట్ లో విలన్ కేరెక్టర్ కోసం ఎంటర్ అయ్యాడు.