కరోనా సెకండ్ వెవ్ కారణంగా తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రాత్రి నుండి అమలులోకి తీసుకురానుంది. అందులో భాగంగా రాత్రి 9 తర్వాత థియేటర్స్, బార్స్, షాపింగ్ కాంప్లెక్స్, వైన్ షాప్స్, రెస్టారెంట్స్ అన్ని మూతబడనున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా థియేటర్స్ లో ఈ నెల 16 నుండి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ నిబంధన పెట్టింది. దానితో చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. తాజాగా తెలంగాణాలో నైట్ కర్ఫ్యూస్ కారణంగా థియేటర్స్ బంద్ అవడంతో.. పూర్తిగా థియేటర్స్ ని క్లోజ్ చేసాయి థియేటర్స్ యాజమాన్యాలు.
50 పర్సెంట్ అక్యుపెన్సీకే తేజ సజ్జా ఇష్క్, అనసూయ థాంక్యూ బ్రదర్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పుడు థియేటర్స్ బంద్ కారణంగా అవి కూడా పోస్ట్ పోన్ అనివార్యంగా మారాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్స్ ని మూసి వేస్తున్నట్టుగా థియేటర్స్ యాజమాన్యాలు ప్రకటన రిలీజ్ చేశాయి.