మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ కరోనా కారణంగా ఆగిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించినా.. మహేష్ బాబు దూకుడు చూస్తే ఈ ఏడాదే సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీ అయ్యేలా ఉంది. ఏదో దసరాకి రాజమౌళి - మహేష్ మూవీ మొదలు పెట్టొచ్చని ఊహాగానాలు ఉన్నా.. ఆర్.ఆర్.ఆర్ తరవాత రాజమౌళి ఆరునెలల గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఈ గ్యాప్ లో మహేష్ త్రివిక్రమ్ తో మూవీకి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ తో చెయ్యాల్సిన త్రివిక్రమ్ అనూహ్యంగా మహేష్ దగ్గరకి చేరాడు.
మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు తర్వాత రాబోతున్న మూవీ కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలుంటాయి. అందుకనే అల్లాటప్పా కథ తీసుకుని మహేష్ తో మూవీ చెయ్యడనికి త్రివిక్రమ్ రెడీగా లేడు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ని రీచ్ అయ్యే మూవీ కావాలి. కాబట్టి మహేష్ తో చెయ్యబోయే మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాగే మహేష్ తో కామెడీ పంచ్ లు వేయించేలా త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నాడట. పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ లా వీరి కాంబో మూవీ ఉండబోతుంది. మహేష్ కామెడీ టైమింగ్ ని త్రివిక్రమ్ ఖలేజా సినిమాలో చూపించాడు. అలాగే దూకుడులో మహేష్ కామెడీ పంచ్ లు మాములుగా పేలలేదు.
ఇప్పుడు త్రివిక్రమ్ ఇంకా అదిరిపోయే కామెడీ పంచ్ లు మహేష్ తో చెప్పించబోతున్నాడట. త్రివిక్రమ్ కి కలిసొచ్చిన పూజ హెగ్డే నే మహేష్ కోసం హీరోయిన్ గా సెట్ చేసాడట. ఇక మహేష్ - త్రివిక్రమ్ మూవీ అనౌన్సమెంట్ మే 31 న రాబోతున్నటుగా తెలుస్తుంది.