కరోనా సెకండ్ వెవ్ పలు రాష్ట్రాలని వణికిస్తుంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల సీఎం లే కరోనా బారిన పడడం ఇంకా కలకలం సృష్తిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న కరోనా బారిన పడ్డారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకి కేసీఆర్ హాజరైనప్పుడు ఈ కరోనా కేసిఆర్ కి అంటుకుని ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. తెలంగాణాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై హై కోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ప్రభత్వాన్ని ప్రశ్నించింది.
అయితే హై కోర్టు 48 గంటల్లోగా వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యుల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. తామే లాక్ డౌన్ పెడతామంటూ కోర్టు తెలంగాణా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడంతో ప్రభుత్వం చకచకా ఈ రోజు నైట్ నుండి తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ పెడుతున్నట్టుగా ప్రకటించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపులు ఇవ్వగా.. ఈ రోజు నైట్ నుండి మే ఫస్ట్ వరకు తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ అమలు చేయమని.. అందులో భాగంగా పబ్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్ని 9 గంటలకే క్లోజ్ చెయ్యాలంటూ ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.