ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఏళ్ళకి తరబడి జరుగుతూనే ఉంది. ఎంత పాన్ ఇండియా మూవీ అయినా.. ఆ పాన్ ఇండియా బజ్ మాత్రం రాధేశ్యామ్ పై క్రియేట్ అవవడం లేదు. ప్రభాస్ లుక్స్ పరంగా తీవ్ర విమర్శలు సోషల్ మీడియాలో రాధేశ్యామ్ పై కురుస్తున్నాయి. అయితే చాల స్లోగా షూటింగ్ జరుపుకుంటున్న రాధేశ్యామ్ సినిమాని వరల్డ్ వైడ్ గా జులై 31న రిలీజ్ చెయ్యడానికి డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ కి సంబందించిన రీ షూట్స్ వలన సినిమా రిలీజ్ ఆలస్యం అవొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇప్పుడు రాధేశ్యామ్ రీ షూట్ అటుంచి.. సినిమాలో ఓ సాంగ్ తో పాటుగా.. ప్రభాస్- కృష్ణంరాజు మీద కీలక సన్నివేశాలు చిత్రీకరణ మిగిలే ఉందట. అందుకే కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లోనూ రాధేశ్యామ్ టీం షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తుందట. మరో పది రోజుల షూటింగ్ చేస్తే.. సినిమా పూర్తవుతుంది. ప్రభాస్ - పూజ హెగ్డే పై ఓ సాంగ్ చిత్రీకరణతో పాటుగా, ప్రభాస్, కృష్ణం రాజు సన్నివేశాల చిత్రీకరణ కోసం రాధేశ్యామ్ టీం పగలనక రాత్రనక కష్టపడుతుందట. ఏకంగా రెండు షిఫ్ట్ ల్లో రాధేశ్యామ్ షూటింగ్ చిత్రీకరణ చేపట్టింది టీం. కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ షూటింగ్ కి బ్రేకులు పడకముందే రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని టీం పరుగులు పెడుతుందట.