యంగ్ స్టర్స్ లో ఎవరూ తండ్రి కొడుకులుగా నటించడానికి ఒప్పుకోరు. ఒప్పుకుంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అంధ్రావాలా గుర్తొస్తే వెంటనే సైడ్ తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టర్స్ లో అన్నదమ్ములుగా నటించడానికి ఒప్పుకుంటారు కానీ ఫాదర్ అండ్ సన్ కేరెక్టర్ అంటే అస్సలొప్పుకోరు. ఫాన్స్ కూడా మెచ్చరు. బాహుబలిలో ప్రభాస్ తండ్రి కొడుకులుగా నటించినా.. వారి కాంబో సీన్స్ ఉండవు. అయితే రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ తో చెయ్యబోయే సినిమాలో తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ని తండ్రి కొడుకులుగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ కి అలాంటి డ్యూయెల్ రోల్ నే ప్లాన్ చేసాడట.
శంకర్ అంటే భారీ తనం, భారీ టెక్నలాజితో సినిమాలు తెరకెక్కిస్తారు. అలాగే హీరోల లుక్ పై శంకర్ ప్రత్యేక శ్రద్ద పెడుతుంటారు. అలా శంకర్ రామ్ చరణ్‌ను కూడా ఫాదర్ అండ్ సన్ కేరెక్టర్స్ లో.. అందులోనూ తండ్రి పాత్రని 60 ఏళ్ల వృద్దుడిగా చూపించబోతున్నట్టు సమాచారం. అందుకే శంకర్ చరణ్‌పై లుక్ టెస్ట్ చేసి.. టెస్ట్ షూట్ కూడా ట్రయిల్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. ముందు అదే 60 ఏళ్ళ ముసలి గెటప్ ని పవన్ తో కానీ, లేదంటే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో కానీ చేయించాలని శంకర్ అనుకున్నారట.. కానీ రామ్ చరణ్ ఫాదర్ అండ్ సన్ గెటప్స్ కి ఒప్పుకోవడంతో శంకర్ చరణ్ నే రెండు పాత్రల్లో చూపించాడనికి రెడీ అవుతున్నారట.