Advertisementt

బ్రేకింగ్: ​సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్

Mon 19th Apr 2021 07:26 PM
kcr,telangana,cs,ksr corona positive,gajwel,form house,cm kcr  బ్రేకింగ్: ​సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్
Telangana CM KCR tested positive for COVID 19 బ్రేకింగ్: ​సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్
Advertisement
Ads by CJ

దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఉధృతంగా ఉంది. కరోనా వచ్చిన కొత్త కన్నా.. సెకండ్ వేవ్ లోనే పలువురు సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కరోనా బారిన పడుతున్నారు. అందుకే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. ప్రస్తుతం, బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అలాగే పొలిటికల్ లీడర్స్ వరకు కరోనాకి అతీతులు కారు అన్నట్టుగా చాలామంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.

కేసీఆర్ కి చాలా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ఆయన గజ్వేల్ లోని ఫామ్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారని, కేసీఆర్ ని ప్రత్యేక డాక్టర్స్ బృందం పరిశీలిస్తున్నట్లుగా తెలంగాణ సీఎస్ తెలిపారు. కేసీఆర్ కి కరోనా లక్షణాలు ఎక్కువగా లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ప్రస్తుతం అయన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా టీఎస్ సీఎస్ తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ టీఆరెస్ కార్యకర్తలు, మంత్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూస్ పెడితేనే కరోనా కట్టడి చెయ్యొచ్చు అని తెలంగాణ హై కోర్టు చెప్పిన కొద్దీ గంటలకే కేసీఆర్ కరోనా బారిన పడడం కలకలకం రేపుతోంది.

Telangana CM KCR tested positive for COVID 19:

CM KCR tested positive for COVID 19