కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూస్, జనతా మహా కర్ఫ్యూలు అమలవుతున్నాయి. కోవిడ్ కంట్రోల్ కి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది లేక వారం, రెండు వారలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా ఉధృతంగా ఉన్నా లాక్ డౌన్ కానీ, నైట్ కర్ఫ్యూ కానీ విధించలేదు. తెలంగాణాలో పరీక్షలు రద్దు, విద్యా సంస్టలు బంద్, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గించడం చేసినా, ఏపీలో పరిక్షల నిర్వహణ లాంటివి ఇంకా జరుగుతున్నాయి. మరోపక్క హై కోర్టు ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
తెలంగాణాలో సెకండ్ వేవ్ ఉధృతి అధికంగా ఉంది. రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తారా? నైట్ కర్ఫ్యూ పెడతారా? రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా టెస్ట్ లు ఎందుకు చెయ్యడం లేదు? 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. వీకెండ్ లాక్ డౌన్ పెట్టాల్సిందే. లేదంటే తామే నిర్ణయం తీసుకుంటామని హై కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. తెలంగాణ హై కోర్టు సంతృప్తి పడడం లేదు. కరోనా వ్యాప్తి శని, ఆదివారాల్లో ప్రజలు ఒకచోట చేరడమే అని, రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తేనే మంచిది అంటూ హై కోర్టు తీర్పు చెప్పి 48 గంటలు తెలంగాణ గవర్నమెంట్ కి టైం ఫిక్స్ చేసింది.