Advertisementt

తెలుగులో ఫస్ట్ ఎక్సపీరియెన్స్

Mon 19th Apr 2021 12:57 PM
nazriya nazim,nani,vivek athreya,mythri movie makers,ante sundaraniki movie,nani tuck jagadeesh,shyam singh roy  తెలుగులో ఫస్ట్ ఎక్సపీరియెన్స్
Nazriya Nazim Joins The Shoot Of Ante Sundaraniki తెలుగులో ఫస్ట్ ఎక్సపీరియెన్స్
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని -రీతూ వర్మ జంటగా నటించిన టక్ జగదీశ్ కరోనా సెకండ్ వేవ్ కారణముగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ కూడా చాలా వరకు జరిగిపోయాయి, రానా నెంబర్ వన్ యారి, జబర్దస్త్ లాంటి షోస్ లో టక్ జగదీష్ ని ప్రమోట్ చేసారు. ఇక ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యాక నాని శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఆ సినిమా కి సంబందించిన కొలకత్తా సెట్ హైదరాబాద్ లోనే ఆరున్నర కోట్లతో నిర్మించి మరీ అందులో శ్యామ్ సింగరాయ్  షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఇక నాని మరో సినిమా నాని 28వ చిత్రం అంటే  సుందరానికీ.. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా న‌జ్రియా న‌జీమ్ తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. రాజా రాణి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన న‌జ్రియా  ఈ రోజు నుండి అంటే సుంద‌రానికీ మూవీ షూటింగ్ లో పాల్గొటోంది. హైద‌రాబాద్‌ లో జ‌రుగుతోన్న ఈ షెడ్యూల్‌లో న‌జ్రియా స‌హా ఇతర కీల‌క తారాగ‌ణంపై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్  నా ఫ‌స్ట్ తెలుగు మూవీకోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ఫ‌స్ట్‌ చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి అంటే సుందరానికీ  నాకు చాలా స్పెషల్  అని పోస్ట్ చేసింది.

ఒరిజిన‌ల్ స్టోరీతో ఒక మ్యూజిక‌ల్ రోమ్-‌కామ్ గా తెర‌కెక్కుతోన్న అంటే సుంద‌రానికీ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను ఆహ్వానించింది చిత్ర యూనిట్‌‌. ఈ సంద‌ర్భంగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు మాట్లాడుతూ - మా టీమ్ త‌రుపున అంటే సుంద‌రానికీ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను స్వాగ‌తిస్తున్నాం. త‌న‌కి, మ‌రియు మా టీమ్ అంద‌రికీ ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్ర‌త్యేకంగా ఉంటుంది అని అన్నారు.

Nazriya Nazim Joins The Shoot Of Ante Sundaraniki:

Nazriya Nazim Joins The Shoot Of Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ