కొమరం భీం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నా.. ఏ సినిమాతో బిజీగా వున్నా ఫ్యామిలీకి కేటాయించాల్సిన టైం కేటాయిస్తుంటాడు. ఫ్యామిలీని సోషల్ మీడియాకి పెద్దగా ప్రొజెక్ట్ కానివ్వని ఎన్టీఆర్.. అప్పుడప్పుడు ప్రవేట్ ఫంక్షన్స్ కి, వెకేషన్స్ వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో కలిసి దొరికిపోతూనే ఉంటాడు. ఇద్దరు కొడుకులని ఎన్టీఆర్ ఏ ఫెస్టివల్ కో, ఏ బర్త్ డే కో సోషల్ మీడియాలో అభిమానులకి చూపిస్తుంటారు. అల్లు అర్జున్, మహేష్ ఫామిలీస్ లాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతగా కనిపించదు. అయితే కెరీర్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తాడో ఎన్టీఆర్.. ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే టైం దొరికినప్పుడల్లా కొడుకు అభయ్, భార్గవ్ లతో ఆడుకుంటూ టైం పాస్ చేస్తాడు. కేవలం ఆడుకోవడమేనా.. ఎన్టీఆర్ తన కొడుకులతో బైక్ రైడ్ చేస్తాడని ఇప్పుడే తెలిసింది.
రీసెంట్ గా ఎన్టీఆర్ తన చిన్న కొడుకుని మోడ్రెన్ బైక్ పై కూర్చోబెట్టుకుని తానే బైక్ రైడ్ చేస్తున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనుక మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. మరి ఎన్టీఆర్ హెల్మెట్ పెట్టుకుని కొడుకుని ఎక్కించుకుని రోడ్డు మీదకొచ్చినా ఫాన్స్ ఎలాగోలా గుర్తుపట్టేస్తారు. అలానే ఎన్టీఆర్ బైక్ డ్రైవ్ చేస్తుండగా కొంతమంది ఫోన్ కెమెరాతో ఫొటోస్ క్లిక్ మనిపించారు. ఆ ఫొటోస్ లో ఎన్టీఆర్ క్లారిటీగా కనిపించకపోయినా.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొడుకుతో బైక్ డ్రైవింగ్ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్, జెమినీ ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్స్ తో బిజీగా వున్నా ఎన్టీఆర్ ఇలా కొడుకుతో బైక్ రైడింగ్ కి వెళ్లడం మాత్రం.. ఫ్యామిలీకి భీం ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంతో అర్ధమవుతుంది.