Advertisementt

ఇంత కామ్ గా ఉంటే పని జరగదు

Sun 18th Apr 2021 10:24 PM
bigg boss 4,akhil,sohel,abhijeet  ఇంత కామ్ గా ఉంటే పని జరగదు
Where is Abhijeeth? ఇంత కామ్ గా ఉంటే పని జరగదు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఎవరికి వారు బిజీ అయ్యారు. కంటెస్టెంట్స్ అంతా యూట్యూబ్ ఛానల్స్ ద్వారానో.. స్టార్ మా ఛానల్స్ ద్వారానో, సినిమాల ద్వారానో బాగానే బిజీ అయ్యారు. కానీ విన్నర్ అభిజిత్ మాత్రం ఇంతవరకు బిజీ అయిన పాపన పోలేదు. రన్నర్ అఖిల్ ఓ వెబ్ సీరీస్, ఓ మూవీ మొదలు పెట్టేస్తే.. మూడో స్థానంలో నిలిచిన సోహెల్ అప్పుడే రెండు సినిమాలని లైన్ లో పెట్టడమే కాదు.. ఓ సినిమాతో సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ఇంకా అభిజిత్ అలానే ఉన్నాడు. కథలు వస్తున్నా ఆచి తూచి అడుగులు వేసే లోపల క్రేజ్ మొత్తం పోయి మరో సీజన్ మొదలయ్యేలా ఉంది అంటూ అభిజిత్ ఫాన్స్ కంగారు పడుతున్నారు.

కనీసం సోషల్ మీడియాలో అయినా అభిజిత్ యాక్టీవ్ గా ఉంటే ఆయనకి హైప్ ఉంటుంది లేదంటే కష్టం అంటూ అభినులు కంగారు పడుతున్నారు. అయితే అభిజిత్ రీసెంట్ గా వెకేషన్స్ కి ఫ్రెండ్స్ తో కలిసి ఓ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ కెరీర్ పరంగా డల్ గా ఉన్నాడు . ఇప్పటికే ముగ్గురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం చెయ్యలేక ఖాళీగా ఉంటున్నారు.. ఇక ఇప్పుడు అభిజిత్ కూడా అలానే అయిపోతాడేమో అని వాళ్ళ భయం. అందులో అఖిల్, సోహెల్ అలా సినిమాల మీద సినిమాలు చేసేస్తుంటే.. అభిజిత్ మాత్రం ఇంకా సినిమా మొదలు పెట్టడం లేదని అభిజిత్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.

Where is Abhijeeth?:

Akhil and Sohel are making films, Abhijeet is yet to start filming

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ