పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపించేసింది. దిల్ రాజు వకీల్ సాబ్ వసూలు లెక్కలు బయటకు చెప్పకపోయినా.. తనకి లెక్కలుంటాయని, వకీల్ సాబ్ కలెక్షన్స్ తొ తాను హ్యాపీ అంటూ ఫిగర్ చెప్పకుండా తికమక పెట్టినా.. ఇక్కడ పవర్ సార్ మ్యానియా వకీల్ సాబ్ ని ఓ రేంజ్ లో నిలబెట్టింది అనేది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బట్టి అర్ధమైపోయింది. దానితో పవన్ ఫాన్స్ హ్యాపీ. మల్టిప్లెక్స్ మూవీ కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే కేవలం పవన్ స్టామీనానే కారణమంటున్నారు వాళ్ళు.
అయితే ఇప్పుడు వకీల్ సాబ్ కి ఓవర్సీస్ టెంక్షన్ మొదలైంది. కరోనా సెకండ్ వెవ్ కారణం వకీల్ సాబ్ ఓవర్సీస్ కలెక్షన్స్ బాగా డల్ గా కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో వకీల్ సాబ్ 1 మిలియన్ డాలర్స్ కు పైగా ఉన్న టార్గెట్ కు ఇప్పటివరకు 7 లక్షల డాలర్స్ కు పైగా మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఓకె కానీ.. ఓవర్సీస్ లోనే బోల్తా కొట్టేలా ఉంది. సెకండ్ వెవ్ ఉధృతి లో మిగిలిన అమౌంట్ ని రీచ్ అవడం వకీల్ సాబ్ కి కష్టమని, కరోనా కారణంగా పవన్ మ్యానియా ఓవర్సీస్ లో పనిచెయ్యలేదని అంటున్నారు ఫాన్స్.