బుల్లితెర మీద ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ పై ప్రమో కట్స్, అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు ఎంట్రీ క్వచ్చన్స్ కూడా జెమిని టీవీ లాక్ చేసేసింది. ఇక రేపో మాపో ఎవరు మీలో కోటీశ్వరులు మూవీ జెమిని టివిలో మొదలు కాబోతుంది అనికుంటే.. ఇప్పుడు ఆ షో వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. కారణం ఇంకేముంది కోవిడ్. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సెలెబ్రిటీ షోస్ లో పాల్గొనడానికి చాలామంది పోటీ పడేవారు. లక్షలాది అప్లికేషన్లు వచ్చేవి.
ఆడిషన్స్ లో ఆ లక్షలాది అప్లికేషన్స్ లో కొంతమందిని సెలెక్ట్ చేసి షో కి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఈ షో కోసం ఇంట్రెస్ట్ చూపించే ఆడియన్స్ తగ్గిపోయారట. లక్షల్లో ఉండే అప్లికేషన్స్ కేవలం వందల్లో రావడం కాస్తా షాకిచ్చే విషయమే. కరోనా వలన పెద్దగా ఎవరూ ఇలాంటి షోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదట. అందుకే కొన్నాళ్ల పాటు ఈ షో ని జెమిని ఛానల్ పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. పరిస్థితులు అనుకూలించాక ఈ షో చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కన్నా ముందే ఎన్టీఆర్ బుల్లితెర మీద సందడి చేస్తాడు.. మా తారక్ లుక్ ని చూసి ఆనందించొచ్చు అని ఆశపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇది షాకింగ్ న్యూసే.