కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాగ చైతన్య లవ్ స్టోరీని, నాని టక్ జగదీశ్ ని, రానా విరాట పర్వం మూవీస్ ని పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. కరోనా సెకండ్ వెవ్, థియేటర్స్ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ.. నిర్మాతలకు నష్టాలూ మిగులుస్తాయని వారు తమ సినిమాలని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే నాగ చైతన్య లవ్ స్టోరీ డేట్ కి ఆర్జీవీ దెయ్యం విడుదలైంది. ఇక ఏప్రిల్ 23 నాని టక్ జగదీశ్ డేట్ ని ఇష్క్ మూవీ తో హీరో తేజ సజ్జా కబ్జా చేసాడు. ప్రియా ప్రకాష్ వారియర్ - తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన ఇష్క్ మూవీ ఏప్రిల్ 23 న రిలీజ్ కాబోతుంది.
ఇక ఏప్రిల్ 30 న రానా - సాయి పల్లవిల విరాట పర్వం మూవీ విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. మళ్ళీ పరిస్థితులు అనుకూలించాకే విరాట పర్వం డేట్ ఇస్తామని దర్శకుడు వేణు ఉడుగుల చెబుతున్నారు. ఇప్పుడు అదే డేట్ ని అనసూయ కబ్జా చేసింది. అనసూయ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన థాంక్యూ బ్రదర్ మూవీ ఏప్రిల్ 30 న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అఫీషియల్ డేట్ కూడా ఇచ్చేసారు. ఎప్పుడో సినిమా పూర్తయినా.. చాలా సినిమాలు పోటీ మధ్యన విడుదలను ఆపుకున్న థాంక్యూ బ్రదర్ మేకర్స్ రానా తప్పుకోవడంతో 50 పెర్సెంట్ అక్యుపెన్సీకే ఏప్రిల్ 30న విడుదల చెయ్యబోతున్నారు.