గత ఏడాది డిసెంబర్ లో నాగబాబు ఇంట ఆయన కూతురు నిహారిక పెళ్లి వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. గుంటూరు రేంజ్ ఐజి ప్రభాకర్ కొడుకు చైతన్య తో నిహారిక పెళ్లి ని రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరిపించింది మెగా ఫ్యామిలీ. పెళ్లి తర్వాత మాల్దీవులకు హానిమూన్ వెళ్లిన ఈ జంట అక్కడ చిలిపి ఫోటో షూట్స్ తో హడావిడి చేసారు. అయితే నిహారిక పెళ్లి సమయంలో నాగబాబు ఆయన కూతురికి వరకట్నం, లాంఛనాలు కింద కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇంకా ఆస్తిపాస్తులు చైతన్యకి ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ నడిచింది.
తాజాగా నాగబాబు తన అల్లుడు చైతన్యకి ఎప్పటికి మరిచిపోలేని ఓ గిఫ్ట్ ఇచ్చాడు. 70లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ డిస్కవరీ కారుని బహుమతిగా అందజేశాడు నాగబాబు. పెళ్లి సమయంలో అల్లుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని.. ఆఖరికి ఉగాదికి పిలిచి మంచి గిఫ్ట్ ఇద్దామనుకున్నా కుదరలేదని.. ఎప్పటినుండో మంచి గిఫ్ట్ ఎవ్వలనుకుంటున్నానని.. అందుకే ఇప్పుడు తన అల్లుడికి రేంజ్ రోవర్ డిస్కవరీ కారుని బహుమతిగా ఇచ్చినట్లుగా నాగబాబు ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మా అల్లుడు చైతన్యకి ఎప్పుడూ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఈ కారుని ప్రెజెంట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. చైతన్య - నిహారికలని కలిసి నాగబాబు దంపతులు ఆ కారుని అందజేశారు.