అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ కాంబోలో ఎప్పుడో మొదలు కావాల్సిన ఐకాన్ మూవీ ప్రాజెక్ట్ విషయంగా ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ డేట్స్ కోసం అటు నిర్మాత దిల్ రాజు ఇటు దర్శకుడు వేణు శ్రీరామ్ వెయిటింగ్. మరి వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ హిట్ అయితే ఐకాన్ పై ఆలోచిద్దామని అల్లు అర్జున్ అనుకుంటే.. వకీల్ సాబ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరోపక్క అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి జంప్ అయ్యాడు. అంటే పుష్ప - కొరటాల మూవీ మధ్యలో ఐకాన్ ఉండొచ్చు అని అందరూ ఊహించుకున్నా అల్లు అర్జున్ స్పష్టత నివ్వకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ ఉంటుంది అంటున్నాడు.
తాజాగా వకీల్ సాబ్ ప్రెస్ మీట్ లో వకీల్ సాబ్ తనకి వసూళ్ల పరంగా, కంటెంట్ పరంగా తృప్తినిచ్చిన సినిమా అని, ఇక వేణు శ్రీరామ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐకాన్ అని చెప్పిన దిల్ రాజు.. ఆ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నాడు. ఐకాన్ స్క్రిప్ట్ తనకి బాగా నచ్చింది అని, ఐకాన్ స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయ్యింది అని అందుకే వేణు శ్రీరామ్ తో ట్రావెల్ చేస్తున్నా.. అయితే ఐకాన్ ఇప్పుడే ఉంటుందా? లేదంటే టైం పడుతుందా? అనేది చెప్పలేనని చెబుతున్నాడు. అలా దిల్ రాజు అల్లు అర్జున్ ఐకాన్ పై ఆశలు రేపుతున్నాడు. మరి దీనికి అల్లు అర్జున్ స్పందనేమిటో చూడాలి.