Advertisementt

డిస్పాయింట్ అవుతున్న హీరోయిన్

Sat 17th Apr 2021 05:18 PM
sai pallavi,love story movie,virata parvam movie,corona second wave,postponed  డిస్పాయింట్ అవుతున్న హీరోయిన్
Disappointed heroine డిస్పాయింట్ అవుతున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా సినిమాలన్ని వాయిదాలు పడుతున్నాయి. క్రాక్ సినిమా హిట్ అవడం, థియేటర్స్ 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ చూసాక దర్శకనిర్మాతలంతా తమ తమ సినిమాల విడుదల డేట్స్ ప్రకటించేశారు. మార్చ్ ఫస్ట్ వీక్ నుండి అక్టోబర్ లో RRR రిలీజ్ డేట్ వరకు ఊపిరాడకుండా రిలీజ్ డేట్స్ లాక్ చేసారు. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వెవ్ సినిమాల విడుదలపై విషం చిమ్మింది. దానితో మళ్ళీ పోస్ట్ పోన్ ల పర్వం మొదలైంది. అందులో ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఇదే నెలలో విడుదల కావాల్సి ఉండగా.. అవి రెండూ పోస్ట్ పోన్ అయ్యాయి. 

ఆమె నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ నిన్న విడుదల కావాల్సి ఉండగా.. అది ముందుగా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎప్పటిలాగే సాయి పల్లవి డాన్స్, పెరఫార్మెన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. ఇక సాయి పల్లవి - రానా కాంబో లో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం సినిమా ఈ నెల 30 న విడుదల కావాల్సి ఉండగా సెకండ్ వెవ్ వలన అదీ వాయిదా పడింది. ఒకే నెలలో రెండు హిట్స్ కొడదామనుకున్న హీరోయిన్ కి ఆ రెండు సినిమాలు వాయిదా పడడం అంటే డిస్పాయింట్ కాక మరేం ఉంటుంది.  

Disappointed heroine:

Sai Pallavi Love Story and Virata Parvam postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ