టాలీవుడ్ లో లవర్ బాయ్ గుర్తింపు పొంది.. ప్రస్తుతం తమిళంలో సినిమా చేసుకుంటున్న సిద్దార్ట్ బాద్ షా లో ఎన్టీఆర్ ఫ్రెండ్ గా ఓ గెస్ట్ రోల్ చేసిన తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. తమిళ్ లో హిట్ అయిన గృహం డబ్బింగ్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్ట్ మళ్ళీ చాలా ఏళ్ళకి తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం మూవీలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు.
టాలీవుడ్ లో తన కంబ్యాక్ మూవీకి సరైన స్క్రిప్ట్ కోసం చాలా కాలం ఎదురుచూసిన హీరో సిద్ధార్థ్ దర్శకుడు అజయ్ భూపతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మహాసముద్రం మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో యంగ్ హీరోస్ శర్వానంద్, సిద్దార్డ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మహాసముద్రంలోని అతని ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇటీవల విడుదలైన తన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శర్వానంద్ కొంచెం అగ్రెసివ్ లుక్‌లో కనిపించగా, సిద్ధార్థ్ మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్నారు. బ్లూ కలర్ షర్ట్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. ఒక పొడవైన క్యూలో నిలబడి ఎవరినో చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
మరి ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న సిద్దార్థ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే