Advertisementt

ఆలస్యం కానున్న చరణ్ - శంకర్ ప్రాజెక్ట్

Fri 16th Apr 2021 09:58 PM
shankar,indian 2,shoot to resume,june,ram charan,rc 15,charan - shankar combo,indian 2 project,lyca productions  ఆలస్యం కానున్న చరణ్ - శంకర్ ప్రాజెక్ట్
Delayed Charan - Shankar project ఆలస్యం కానున్న చరణ్ - శంకర్ ప్రాజెక్ట్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ మూవీ జులై నుండి కానీ ఆగష్టు నుండి కానీ దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో మొదలు కావాల్సి ఉంది. ఇప్పటికే దిల్ రాజు పర్యవేక్షణలో స్టోరీ రెడీ అయ్యింది అని.. ఈ సినిమా లో రామ్ చరణ్ కోసం హీరోయిన్ వెతుకులాటలో ఉన్నామని దిల్ రాజు చెప్పినా.. కియారా కానీ రష్మిక కానీ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే RC15 మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతుంది. కోలీవుడ్ హీరో సూర్య - రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీ అంటుంటే.. కాదు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారని అంటున్నారు. అలాగే అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ కూడా అయ్యాడు. అంతా ఓకె.. చరణ్ - శంకర్ RC15 ఆగష్టు నుండి సెట్స్ మీదకెళ్లబోతుంది అనుకుంటే.. ఇప్పుడు ఈ కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సమయం పట్టేలా కనిపిస్తుంది. కారణం శంకర్.

కమల్ తో శంకర్ చెయ్యాల్సిన ఇండియన్ 2 సినిమాని మళ్ళీ జూన్ నుండి ప్రారంభించే యోచనలో శంకర్ ఉన్నారు. అదే విషయాన్నీ శంకర్ తన లాయర్ తో కోర్టులో చెప్పించారు. లైకా వారు వేసిన కేసుకి సమాధానంగా ఇండియన్ 2 సినిమా ఆగిపోలేదని కోవిడ్ కారణముగా విదేశీ నిపుణుల రాక ఆలస్యం కావడంతో షూటింగ్ ఆగింది అని.. జూన్ నుండి ఇండియన్ 2 షూటింగ్ మళ్ళీ మొదలుపెడతామని కోర్టుకి శంకర్ లాయర్ చెప్పారు. అప్పుడే కమల్ డేట్స్ కూడా తీసుకుని, అలాగే విదేశీ నిపుణలను రప్పించడం వరకు శంకర్ అన్ని స్వయంగా చూసుకుంటూ.. ఆ సినిమాని త్వరగా పూర్తి చేసేసి లైకా చేతిలో పెట్టేసి.. రామ్ చరణ్ మూవీకి శంకర్ షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది. 

మరి ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ కావడానికి ఓ ఆరు నెలల టైం పట్టడం ఖాయం. సో చరణ్ - శంకర్ మూవీ అలా ఆలస్యమవుతుందన్నమాట.

Delayed Charan - Shankar project:

Shankar Indian 2 shoot to resume from June

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ