Advertisementt

కొన్నిరోజులు రెస్ట్ తీసుకోండి బాస్

Fri 16th Apr 2021 08:46 PM
pawan kalyan,pawan kalyan tests covid positive,pawan kalyan tirupati tour,pawan treatment at farmhouse,cardiologist dr thankella suman,treats,pawan kalyan  కొన్నిరోజులు రెస్ట్ తీసుకోండి బాస్
Pawan tests positive for Covid19 కొన్నిరోజులు రెస్ట్ తీసుకోండి బాస్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. పలు రాష్ట్రాల్లో లెక్కకు మించి కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ పెట్టేసింది సర్కార్. ఇక దేశ రాజధానిలోనూ కరోనా కోరలు చాచింది. ఢిల్లీ లో హాస్పిటల్ బెడ్స్ లేక కరోనా రోగులు విలవిల లాడుతన్నారు. లెక్కకు మించిన సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పుణ్యమా అని వకీల్ సాబ్ హీరోయిన్ నివేత థామస్ కరోనా బారిన పడి కోలుకునే లోపు నిర్మాత దిల్ రాజు, బండ్ల గణేష్ లు కరొనకి దొరికిపోయారు. వారు కోలుకుంటున్నారనుకోగానే పవర్ స్టార్ పవన్ కి కరోనా సోకింగి. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో ఆయనకి ఆక్సిజెన్ పెట్టి వైద్యం అందిస్తున్నారు వైద్యులు. 

ప్రస్తుతం పవన్ ఆయన ఫామ్ హౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న శేఖర్ కె చంద్ర, క్రిష్ లు ప్రస్తుతం తమ షూటింగ్స్ ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. వకీల్ సాబ్ తర్వాత ఏకే రీమేక్, హరిహరవీరమల్లు సినిమాల షూటింగ్స్ కి హాజరు కావాల్సిన పవన్ గత నాలుగు రోజుల నుండి హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. దానితో ఆయన నటిస్తున్న షూటింగ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ ఉత్సాహంలో ఏకే రీమేక్ కూడా త్వరగా పూర్తవుతుంది అనుకుంటే.. ఇప్పుడు పవన్ కి కరోనా సోకడంతో అటు క్రిష్, ఇటు ఏకే రీమేక్ దర్శకులని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి బాస్ అంటున్నారు పవన్ ఫాన్స్. పవన్ కోలుకున్నాక షూటింగ్స్ మొదలు పెట్టుకోండి అంటూ సలహాలిస్తున్నారు.

Pawan tests positive for Covid19:

Pawan Kalyan movie shootings postponed due to corona

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ