Advertisementt

పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్

Fri 16th Apr 2021 05:10 PM
pawan kalyan,power star,covid 19,corona positive,pawan kalyan corona  పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్
Pawan Kalyan tested Covid positive పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సక్సెస్ తో ఖుషీగా ఉన్నారు. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోనూ హుషారుగా పాల్గొన్నారు. అయితే కొద్దీ రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో ఆయన ముందు జాగ్రత్తగా హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిపోయారు. స్వీయ నిర్బంధంలో ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయనకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నట్లుగా పవన్ పీఆర్ టీం.. పవన్ కళ్యాణ్ ఫోటో తో పాటుగా హెల్త్ అప్ డేట్ ఇచ్చింది. 

ఆ ఫోటో లో పవన్ కళ్యాణ్ కి ఆక్సిజన్ పెట్టడంతో.. బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఆయన క్షేమంగానే ఉన్నారని ఆ పిక్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి కరోనా చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడడంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ జనసేన కార్యకర్తలు, ఇటు పవన్ కళ్యాణ్ ఫాన్స్ దేవుళ్ళకి మొక్కేస్తున్నారు. వకీల్ సాబ్ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యకుండా పవన్ ఇలా కరోనా బారిన పడడం పవన్ ఫాన్స్ ని కలిచివేస్తుంది.

కొద్దిరోజుల క్రితమే వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకి, పవన్ కళ్యాణ్ ని విపరీతంగా అభిమానించే బండ్ల గణేష్ కి కరోనా వచ్చింది. బండ్ల పరిస్థితి నిన్నటివరకు క్రిటికల్ గా ఉన్నా.. ప్రస్తుతం కరోనా నుండి ఆయన కోలుకుంటున్నారు.

Pawan Kalyan tested Covid positive:

Power Star Pawan Kalyan tested Covid positive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ