కోలీవుడ్ ప్రముఖ స్టార్ కమెడియన్ వివేక్ కి ఈ రోజు గుండెపోటు రావడంతో ఆయన చెన్నై లోని ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ రోజు ఉదయం వివేక్ కి గుండె నొప్పి రావడంతో.. అత్యవసర పరిస్థితిల్లో ఆయనని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే ప్రస్తుతం వివేక్ పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉందని.. ఆయన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ చెబుతున్నారు. వివేక్ నిన్ననే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఆయన ఇలా అనారోగ్యం పాలవడంతో అందరిలో చర్చ మొదలైంది. ఆయన వ్యాక్సిన్ తీసుకున్నాక.. అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ విజ్ఞప్తి చేసారు.
ఇలా వ్యాక్సిన్ తీసుకున్న ఒక్కరోజులోనే ఆయన హాస్పిటల్ పాలవడం అందరిలో అందోళన కలిగిస్తుంది. ఆయన ఆరోగ్యంతో త్వరగా తిరిగి రావాలంటూ కోలీవుడ్ ప్రముఖులు గెట్ వెల్ సూన్ వివేక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా వివేక్ ఇటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడే.