గత శుక్రవారం విడుదలైన పవర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా అటు మల్టిప్లెక్స్, ఇటు బిసి సెంటర్స్ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంది. పవర్ ఫుల్ డైలాగ్స్, పవన్ నటన, ప్రకాష్ రాజా, అంజలి, నివేత థామస్ ల పెరఫార్మెన్స్ అన్ని వకీల్ సాబ్ కి మెయిన్ హైలెట్ గా నిలవగా థమన్ నేపధ్య సంగీతం మరో మెయిన్ హైలెట్. అయితే వకీల్ సాబ్ కలెక్షన్స్ ఇంతవరకు అధికారికంగా బయటికి వచ్చింది లేదు. ఫస్ట్ డే నుండి ఇప్పటివరకు వకీల్ సాబ్ కలెక్షన్స్ ని హైప్ చేసి ఉంచారు. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ నుండి బయటికి వచ్చిన ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఫిగర్ చూస్తే పవన్ మ్యానియా ఎంతలా ఉందో అర్ధమవుతుంది. మూడేళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన పవన్ క్రేజ్ ఎక్కడా ఏమాత్రం తగ్గలేదని ఈ వసూళ్లు నిరూపించాయి.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం 28.2
సీడెడ్ 13.1
అర్బన్ ఏరియాస్ 11.6
ఈస్ట్ 06.3
వెస్ట్ 07.4
గుంటూరు 07.2
కృష్ణ 04.9
నెల్లూరు 03.8
టోటల్ ఏపీ అండ్ టీఎస్ 82.4 కోట్లు
కర్ణాటక ఇతర ప్రాంతాలు 6.5
ఓవర్సీస్ 6.4
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 95.3 కోట్లు