నిన్న సెంట్రల్ గవర్నమెంట్ CBSC 10th ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసింది. కారణం కరోనా సెకండ్ వెవ్. 10th ఎగ్జామ్స్ ని రద్దు చేసిన CBSC బోర్టు 12th ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసింది. అయితే కరోనా సెకండ్ వెవ్ పలు రాష్ట్రాల్లో ఉధృతంగా ఉంది. దాని వలన ఇంటర్, 10th స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ ని వాయిదా వెయ్యాలా? లేదంటే రద్దు చెయ్యాలా? అనే సస్పెన్స్ లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. ఏపీ రాష్ట్రంలో కరోనా తో టీచర్స్ కన్ను మూయడం కలకలం రేపగా.. విద్యార్థులు కరోనా బారిన పడడం అందరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడగా.. కరోనా ఉధృతి కారణంగా ఉదయం నుండి 10th, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు, వాయిదా విషయంలో జరిగిన మీటింగ్స్ లో భాగంగా తెలంగాణ పదవ తరగతి పరీక్షలని రద్దు చేస్తూ తెలంగాణా విద్యాశాఖ జీవో జారీ చేసింది. అలా 10th ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసిన కొద్దీ నిమిషాలకే తెలంగాణా మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలని క్యాన్సిల్ చేస్తూ తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలని రద్దు చేస్తూ.. వాళ్ళని నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలని మాత్రం పోస్ట్ పోన్ చేసింది. కరోనా ఉధృతి తగ్గాక ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలంగాణా ఇంటర్ బోర్డు తెలియజేసింది. కరోనా కారణంగా నిన్న CBSC నేడు టీఎస్ 10th, ఇంటర్ ఎగ్జామ్స్ ని రద్దు చేసారు.