NTR30 ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ ప్లేస్ లోకి కొరటాల శివ వచ్చిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ NTR30 ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అనే టాక్ నడిచింది. తాజాగా కొరటాల శివ - ఎన్టీఆర్ మూవీ కథపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. కొరటాల శివ ఎన్టీఆర్ ని జనతా గ్యారేజ్ సినిమాలో మొక్కలను ప్రేమించే అబ్బాయిగా, అన్యాయాన్ని ఎదురించి పోరాడే యువకుడిగా చాలా స్టైలిష్ పాత్రలో చూపించాడు. కొరటాల శివ తన సినిమాల్లో సామజిక అంశాలతో పాటుగా.. హీరోని చాలా అందంగా స్టయిల్ గా చూపిస్తాడు.
ఇప్పుడు NTR30 లో ఎన్టీఆర్ ని పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా ఎలా చూపిస్తాడో అనే దాని మీద ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆత్రుత ఎక్కువైపోతుంటే.. కొరటాల శివ ఈసారి ఎన్టీఆర్ ని అమాయకమైన హీరో పాత్రలో చూపించబోతున్నాడని, పల్లెటూర్లో అమాయకంగా తిరిగే కుర్రాడు అనుకోకుండా సిటీకి వెళ్లాల్సి వస్తుందట. పల్లెటూరి నుండి సిటీకి వెళ్లిన ఆ అమాయకపు కుర్రాడు హీరోయిజం చూపించే కుర్రాడిగా పరిస్థితులు ఎలా మార్చాయో అనేదే కొరటాల - ఎన్టీఆర్ మూవీ కథగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎప్పటిలాగే కొరటాల ఈ సినిమాలోనూ సందేశాన్ని ఫాన్స్ కి ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది వాళ్ళ మూవీ మొదలైతేనే కానీ తెలియదు.