Advertisementt

బన్నీ కి ఫాహద్ - మహేష్ కి మాధవన్

Thu 15th Apr 2021 05:43 PM
mahesh babu,sarkaru vaari paata movie,mahesh villain,kollywood hero madhavan,madhavan villain,nishbdam movie,savyasachi movie  బన్నీ కి ఫాహద్ - మహేష్ కి మాధవన్
Fahadh to Bunny- Madhavan to Mahesh బన్నీ కి ఫాహద్ - మహేష్ కి మాధవన్
Advertisement
Ads by CJ

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో విలన్ గా విజయ్ సేతుపతి ప్లేస్ లో మలయాళ విలక్షణ హీరో ఫాహిద్ ఫాజిల్ వచ్చాడు. ఈమధ్యనే పుష్ప టీం ఫాహిద్ ఫాజిల్ కి పుష్ప సినిమాలోకి గ్రాండ్ వెల్ కం చెప్పింది. ఇక ఇప్పుడు మహేష్ విలన్ కూడా రివీల్ కాబోతున్నాడట. అంటే పరశురామ్ - మహేష్ బాబు కాంబోలో జనవరిలో మొదలైన సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.

రీసెంట్ గా హైదరాబాద్ లో సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ మొదలైంది. కరోనా నిభందనలు పాటిస్తూ సర్కారు వారి పాట షూటింగ్ చేస్తుంది టీం. ఇప్పుడు సర్కారు వారి విలన్ ని రివీల్ చెయ్యబోతుందట టీం. అయితే సర్కారు వారి పాట సినిమా విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరోల పేర్లు వినిపించినా తాజాగా నిశ్శబ్దం విలన్ మాధవన్ మహేష్ సర్కారు వారి పాట విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. కాకపోతే మాధవన్ విలన్ గా చేసిన సవ్యసాచి, అలాగే నిశ్శబ్దం మూవీస్ ప్లాప్ అవడంతో సర్కారు యూనిట్ ఆలోచనలో పడిందట. ఇంతకుముందు ఉపేంద్ర, అరవింద్ స్వామిలను సంప్రదించగా డేట్స్ ప్రోబ్లెంస్ రావడంతో చివరికి సర్కారు టీం మాధవన్ నే ఓకె చేయబోతుంది అంటున్నారు.

Fahadh to Bunny- Madhavan to Mahesh:

Villain in Sarkaru Vaari Paata to be Madhavan?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ