దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో చెయ్యాల్సిన ఇండియన్ 2 మూవీ ని పక్కనపడేసి ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. శంకర్ తో సినిమా చెయ్యాలనే హీరోల కల ఒక్కొక్కటిగా నెరవేరుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు తమిళ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శంకర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ కి కమిట్ అయ్యాడు. వెంటనే ఇండియన్ 2 నిర్మాతలు లైకా ప్రోక్షన్స్ వారు శంకర్ పై కేసు వేశారు. ఇండియన్ 2 మూవీ పూర్తి చేసి చరణ్ మూవీ చేసుకోండి అంటూ నోటీసు పంపించారు. అది అలా ఉంటే.. ఇప్పుడు శంకర్ బాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ చెయ్యబోతున్నాడు.
అది కూడా తాను గతంలో విక్రమ్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అపరిచితుడు మూవీ ని మళ్ళీ ఇన్నేళ్లకి రన్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు శంకర్. అది కూడా వచ్చే ఏడాది మధ్యలో ఈ మూవీ రీమేక్ అవుతుంది అని ప్రకటించారు. అయితే ఇప్పుడు అపరిచితుడు మూవీ నిర్మాత రవిచంద్రన్ ఈ రీమేక్ విషయంలో సంతృప్తిగా లేడు. తన అనుమతి లేకుండా ఈ సినిమాని ఎలా రీమేక్ చేస్తారు.. ఆలా చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు అంటూ ప్రెస్ నోట్ విడుదల చెయ్యడం కలకలం రేపింది. ఒరిజినల్ వెర్షన్ అన్నియన్ కథ తనకు సొంతం అని నిర్మాత రవిచంద్రన్ చెప్తున్నాడు. అలాంటిది తనకే తెలియకుండా శంకర్ ఎలా ఈ సినిమాని రీమేక్ చేస్తారంటూ ఆయన మండిపడుతున్నారు.
మరి శంకర్ ఈ అపరిచితుడు విషయంలోనూ లీగల్ గా సమస్యలు ఎదుర్కోబోతున్నాడనే అనిపిస్తుంది. అటు రామ్ చరణ్ మూవీ విషయంలో చిక్కుల్లో పడిన శంకర్, ఇటు రన్వీర్ సింగ్ తో మూవీ విషయంలోనూ ఇలాంటి చిక్కులు ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగే అనిపిస్తున్నాయి.