తేజా సజ్జా హీరోగా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇష్క్’. సౌత్ ఇండియాలోని టాప్ బ్యానర్స్‌లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్.. కొంత గ్యాప్ తర్వాత నిర్మించిన చిత్రమిది. నాట్ ఏ లవ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ ట్రైలర్‌ను విడుదల చేసి.. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని చెబుతూ.. టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక చక్కటి క్యూట్ లవ్ స్టోరీగా మొదలైన ఈ ట్రైలర్.. సడెన్‌గా ఓ థ్రిల్లర్‌గా మారిపోయింది. ట్యాగ్‌లైన్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేలా.. ఇది లవ్ స్టోరీ కాదనేది.. ట్రైలర్ చెప్పేస్తుంది. సస్పెన్స్‌తో కూడిన మిస్టరీతో ఈ చిత్రం రూపొందినట్లుగా తెలియజేయడంలో ట్రైలర్ సక్సెస్ అవడమే కాకుండా.. సినిమాపై ప్రేక్షకులలో ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసేలా ఉంది. ఈ సినిమాకు, సినిమాలో చూపించే కారుకు మధ్య ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏదో ఉన్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్‌లో కూడా అందుకే కారును హైలెట్ చేసినట్లు ఉన్నారు. అలాగే మహతి స్వర సాగర్, మ్యూజిక్, శ్యామ్ కె నాయకుడు ఫొటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ అనేలా ఉన్నాయి. నటీనటులందరికీ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న చిత్రంగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచే విధంగానే కట్ చేశారు. మరి సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలంటే.. ఏప్రిల్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.