Advertisementt

త్రివిక్రమ్ - పూరి ఇద్దరిలో ఎవరు ఫస్ట్

Wed 14th Apr 2021 12:14 PM
mahesh babu,sarkaru vaari paata,puri jagannadh,trivikram srinivas,mahesh next,ssmb28,puri liger movie,trivkram  త్రివిక్రమ్ - పూరి ఇద్దరిలో ఎవరు ఫస్ట్
All eyes on Mahesh Babu త్రివిక్రమ్ - పూరి ఇద్దరిలో ఎవరు ఫస్ట్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున కరోనా నిభందనలు పాటిస్తూ.. అన్ని రకాల ముందు జాగ్రత్తలతో మొదలైనట్లుగా అప్ డేట్ ఇచ్చింది టీం. అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి తో సినిమాకి కమిట్ అయ్యాడు. రాజమౌళి మాత్రం ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యాక ఆరు నెలల గ్యాప్ తో మహేష్ మూవీ మొదలు పెడదామని.. మహేష్ కి సర్కారు వారి పాట - రాజమౌళి మూవీకి మధ్య మరో మూవీ చేసుకునే ఛాన్స్ ఇవ్వడంతో మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తాడో అనే క్యూరియాసిటిలో మహేష్ ఫాన్స్ ఉన్నారు. 

ఆరు నెలల టైం లో సినిమాని ఫినిష్ చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు పూరి మాత్రమే. అందుకే పూరి - మహేష్ సినిమా ఉండొచ్చు అనుకునేలోపు.. ఎన్టీఆర్30 నుండి త్రివిక్రమ్ బయటికి రావడం అందులోకి మహేష్ దూరాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో SSMB28 త్వరలోనే ఎనౌన్సమెంట్ రాబోతుంది అంటూ ఆ వార్త సారాంశం. అయితే ఇప్పటికే మహేష్ భార్య - పూరి జగన్నాధ్ మధ్యన మహేష్ నెక్స్ట్ మూవీ విషయంగా మీటింగ్ జరిగినట్లుగా వార్తలొస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ తో మహేష్ మూవీ అంటున్నారు. 

అయితే మహేష్ సర్కారు వారి పాట - రాజమౌళి మూవీ మధ్యలో త్రివికం తో ఫస్ట్ చేస్తాడా? లేదంటే పూరి తో మహేష్ మూవీ పట్టాలెక్కుతుందా? అనేది ఇప్పుడు అందరిలో మొదలైన ప్రశ్న. మహేష్ - పూరి, మహేష్ - త్రివిక్రమ్ ఆల్రెడీ ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో మహేష్ మూవీస్ చేసి ఉన్నాడు. ఇద్దరిలో ఎవరి స్టోరీ బాగా నచ్చితే వారితో మహేష్ ముందుకు వెళతాడు. అసలే ఈమధ్యన సినిమా కథల విషయంలో మహేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

All eyes on Mahesh Babu:

All eyes on Mahesh Babu decision now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ