సీనియర్ హీరోలైన వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ లు ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నారు. అందులో వెంకటేష్ రెండు రీమేక్స్ తో, ఒక స్ట్రయిట్ మూవీతో బిజీ. వెంకటేష్ తమిళ అసురన్ రీమేక్ గా నారప్ప మూవీ చేస్తుంటే.. ఉగాది స్పెషల్ గా నారప్ప పోస్టర్స్ రిలీజ్ చేసింది టీం. ఆయన నటిస్తున్న దృశ్యం 2, ఎఫ్ 3 మూవీస్ సెట్స్ మీదున్నాయి. ఇక చిరుకి ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. కొరటాల తో ఆచార్య మూవీ చేస్తున్న చిరు.. ఆ సినిమా నుండి చరణ్ సిద్ద లుక్ ఉగాది కానుకగా విడుదలైంది. మోహన్ రాజా లూసిఫెర్ సెట్స్ మీదుండగా.. బాబీ, మెహెర్ రమేష్ వేదాళం రీమేక్స్ ఉన్నాయి.
ఇక బాలకృష్ణ .. బోయపాటి దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్నాడు. ఉగాది కానుకగా విడుదలైన BB3 అఖండ టీజర్ అదరగొట్టేసింది. అలాగే మరోపక్క గోపీచంద్ మలినేని మూవీ లైన్ లో ఉంది బాలయ్యకి. అయితే వైల్డ్ డాగ్ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున.. ప్రవీణ్ సత్తారుతో మూవీ స్టార్ట్ చేసాడు. మరి ఈమధ్యనే మొదలైన మూవీకి ఇంకా లుక్ రెడీ కాలేదేమో.. అందుకే నాగ్ కొత్త సినిమా నుండి ఉగాది ట్రీట్ రాలేదు. ఆఖరికి మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా పోస్టర్ కూడా ఈ ఉగాదికి రిలీజ్ చేసింది టీం. కేవలం నాగ్ తప్ప అందరూ ఫుల్ జోష్ లోనే ఉన్నారు.