యశ్ - ప్రశాంత్ నీల్ అనే దర్శకుడుని, హీరో ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా కెజిఫ్. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లో ఓ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ జంట. కెజిఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ తో ప్రశాంత్ నీల్ పై స్టార్ హీరోల కన్ను పడింది. కెజిఎఫ్ లో యశ్ లో హీరోయిజాన్ని ఆ రేంజ్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు అదే కాంబోలో కెజిఎఫ్ సీక్వెల్ కెజిఎఫ్ 2 రాబోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియాలో కెజిఎఫ్ 2 పై భారీ అంచనాలున్నాయి. కెజిఎఫ్ టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచిన యాష్ - ప్రశాంత్ లు.. ఈ సినిమాని అన్ని భాషల్లో జులై 16న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కెజిఎఫ్ అప్ డేట్స్ ఏం లేకపోయినా.. కెజిఎఫ్ 2 స్టోరీ పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కెజిఎఫ్ లో గరుడని చంపి ఆ సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్న రాఖి భాయ్ గరుడ తమ్ముడు అధీరా తో తలపడాల్సి వచ్చి.. ఆఖరికి అధీరని మట్టుబెట్టిన తర్వాత రాఖి భాయ్ రారాజుగా మరిపోతాడు. కానీ దేశ ప్రధాని అంటే రవీనా టాండన్ పాత్రధారి తన సైన్యంతో రాఖి భాయ్ సామ్రాజ్యంపై దండెత్తి రాఖి భాయ్ ని చంపేస్తుంది. ఇదే కెజిఎఫ్ 2 క్లయిమాక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. రాఖి భాయ్ అమ్మ చెప్పినట్టుగా చనిపోయేటప్పుడు రాజుగా ధనవంతుడిగా రాఖి భాయ్ చనిపోయే ఎపిసోడ్ ని క్లయిమాక్స్ ఎపిసోడ్ గా ప్రశాంత్ నీల్ డిజైన్ చేసుకున్నాడట. దీని బట్టి కెజిఎఫ్ 2 క్లయిమాక్స్ విషాదాంతంగా ముగుస్తుందన్నమాట.