కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ గుత్తా జ్వాలా గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. విష్ణు విశాల్ కోసం గుత్తా జ్వాలా చెన్నై కి వెళ్లడం, విష్ణు గుత్తా జ్వాలా కోసం హైదరాబాద్ కి రావడం తరుచూ జరుగుతూనే ఉంది. అయితే గుత్తా జ్వాలా గతంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో పెళ్లాడింది. ఆ తరువాత వారిద్దరూ 2011లో విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి జ్వాల సింగిల్‌గా ఉంటుంది. మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్.. ఆమెతో 2018లో విడాకులు తీసుకున్నాడు. అయితే విష్ణు విశాల్ కి రజిని కి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా.. విడాకుల తర్వాత అతడు విశాల్ సంరక్షణలో ఉన్నాడు.
గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న విష్ణు - జ్వాలా పెళ్లి విషయం సోషల్ మీడియాలో నానుతుంది. రీసెంట్ గా అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ కలిసి అటెండ్ అయినప్పుడు మీడియా వారిని పెళ్లి మేటర్ అడిగింది. త్వరలోనే అంటూ చెప్పిన ఈ సెలెబ్రిటీ జంట తాజాగా పెళ్లి తేదీ ని అధికారికంగా అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 22 న విష్ణు - గుత్తా జ్వాలా ఒక ఇంటి వారు కాబోతున్నట్టుగా వాళ్ళ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట.