Advertisementt

రాజుగారికి కరోనా

Mon 12th Apr 2021 08:50 PM
dil raju,vakeel saab,producer dil raju,corona positive,dil raju corona  రాజుగారికి కరోనా
Dil Raju tested positive for Corona రాజుగారికి కరోనా
Advertisement
Ads by CJ

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు కి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దిల్ రాజుకి కరోనా సోకడంతో ఆయనతో తిరిగిన వారంతా ఇప్పుడు కరోనా టెస్ట్ లు చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇంతకుముందే వకీల్ సాబ్ హీరోయిన్ నివేత థామస్ కి కరోనా సోకడం ఆమె హోమ్ క్వారంటైన్ కి వెళ్లగా.. పవన్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకిన కారణంగా ఆయన ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. తాజాగా దిల్ రాజు కి కరోనా రావడంతో ఆయనని గత మూడు రోజులుగా మీట్ అయిన వారంతా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అందులో వేణు శ్రీరామ్ దిల్ రాజు వెంటే ఉన్నాడు.

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో మెగాస్టార్ చిరు ప్రత్యేకంగా దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ని సత్కరించారు. ఇప్పుడు చిరు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలేమో అంటూ మెగా ఫాన్స్ టెంక్షన్ పడుతున్నారు. గతంలో కరోనా సోకింది అనుకుని ఆయన మూడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ కరోనా  నెగెటివ్ రావడంతో మెగా ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నా ఇప్పుడు దిల్ రాజుకి కరోనా రావడంతో చిరు ఫాన్స్ కంగారులో ఉన్నారు. ఇక దిల్ రాజు వకీల్ సాబ్ రిలీజ్ రోజున భార్య తో థియేటర్ లో పేపర్స్ ఎగరేస్తూ.. పవన్ ఫ్యాన్ గా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 

ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడంతో దిల్ రాజు హోమ్ క్వారంటైన్ లో కి వెళ్ళిపోయాడు. దానితో ఈరోజు జరిగిన వకీల్ సాబ్ మగువ నీ విజయం ఈవెంట్ కి అందుబాటులో లేకుండా పోయారు.

Dil Raju tested positive for Corona:

Dil Raju tested positive for Covid19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ