పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మహారాష్ట్ర సర్కార్ అక్కడ ముంబై పరిసర ప్రాంతాల్లో కఠిన కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. దానితో లైగర్ షూటింగ్ కి తాత్కలిక బ్రేక్ వేసి హైదరాబాద్ కి చేరుకుంది టీం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన ఇంట్లోనే సేద తీరుతుంటే.. పూరి మాత్రం లైగర్ ఎడిటింగ్ వర్క్ మొదలు పెట్టేసాడు. ఇక ఛార్మి తన క్యూట్ పెట్స్ తో ఛిల్ అవుతుంది.
అయితే లైగర్ సినిమా కోసం హెయిర్ బాగా పెంచిన విజయ్ దేవరకొండ గత ఏడాది గా అదే లుక్ లో కంటిన్యూ అవుతున్నాడు. లైగర్ లో బాక్సర్ గా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ జిమ్ వర్కౌట్స్ చేస్తూ బాడీ షేప్ చెడకుండా కాపాడుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు లైగర్ క్లైమాక్స్ షూటింగ్ చిత్రీకరణ కోసం విజయ్ గిరజాల జుట్టుని పెంచాడట. లైగర్ క్లయిమాక్స్ ఎమోషనల్, యాక్షన్ ఎపిసోడ్ లా పూరి డిజైన్ చేసుకున్నాడట. దాని కోసం విజయ్ దేవరకొండ గిరజాల జుట్టు ని పెంచి మరింత మేకోవర్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో విడుదల కానుంది.