ఏపీ లో పవన్ వకీల్ సాబ్ vs జగన్ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. వకీల్ సాబ్ బెన్ ఫిట్ షోస్ ని రద్దు చెయ్యడమే కాకుండా టికెట్స్ రేట్స్ పెరక్కుండా జగన్ ప్రభుత్వం రాత్రికి రాత్రే జీవోలు పాస్ చెయ్యడం, వకీల్ సాబ్ విడుదలైన రోజు ఈ గొడవ కాస్తా కోర్టుకి వెళ్లడం.. హై కోర్టులో వకీల్ సాబ్ కి టికెట్స్ రేట్లు రెండు రోజులు పెంచుకున్నా, ఆదివారం మాత్రం ప్రభుత్వం చెప్పిన రేటుకే టికెట్స్ అమ్మలంటూ కోర్టు తీర్పు వచ్చేసరికి వకీల్ సాబ్ మొదటి రెండు రోజుల ముచ్చట అయ్యింది.. మూడో రోజు జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే వకీల్ సాబ్ ఏపీ థియేటర్స్ లో ఆడింది. ఇదంతా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి జగన్ ప్రభుత్వం పై ఆగ్రహాన్ని తెప్పించాయి.
అయితే తాజాగా నాగబాబు మాత్రం వకీల్ సాబ్ టికెట్స్ రేట్ల ఇష్యు లో జగన్ పాత్ర ఉండి ఉండదు.. సీఎం జగన్ అలాంటి పనులు చేస్తాడంటే నమ్మను, పాలనా పరమైన కార్యక్రమాలతో జగన్ బిజీగా ఉండడం వలన.. స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధులు, వేరే రాజకీయనేతలు బెనిఫిట్ షోల రద్దుకు కారకులని తాను భావిస్తున్నట్టు చెబుతున్నాడు. అసలు విషయం జగన్ కి తెలిస్తే ఈ విషయంపై తప్పకుండా స్పందిస్తాడని, రాజకీయ పరమైన కారణాలను, వృత్తి పరమైన జీవితంపై ఇలా వ్యవహరించడం సరికాదంటూ.. జగన్ ప్రభుత్వాన్ని, జగన్ ని పవన్ రెండో అన్నయ్య నాగబాబు వెనకేసుకురావడం మాత్రం నిజంగానే విచిత్రంగా అనిపిస్తుంది.
కొన్ని విషయాలపైన అర్ధం పర్ధం లేకుండా మాట్లాడే నాగబాబు ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలో అందరూ జగన్ ని విమర్శిస్తుంటే.. నాగబాబు మాత్రం ఇలా జగన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చూసిన పవన్ ఫాన్స్ నాగబాబు పై గుర్రుగా ఉన్నారు.