కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కలవరపెడుతుంది. గత ఏడాది మార్చి లో ఏం జరిగిందో.. ఈ మార్చి లోనూ సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. గత ఏడాది లాక్ డౌన్ తో అన్ని మూతబడినా.. ఈ ఏడాది మాత్రం లాక్ డౌన్ లేకపోయినా.. థియేటర్స్ కి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇవ్వడం లేదు. 50 పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ నడిపితే సినిమాలకు లాభాలు రావు. అందుకే చాలా సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. ముందుగా నాగ చైతన్య తన లవ్ స్టోరీ ని వాయిదా వేసేసి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు నాని టక్ జగదీశ్ సంగతి తేల్చడం లేదు. ఈ నెల 23 న విడుదల కాబోయే కంగనా తలైవి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ అదే 23 న రావాల్సిన జగదీశ్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
మరోపక్క నాని టక్ జగదీశ్ ప్రమోషన్స్ కూడా ఆపేసాడు. సడన్ గా ప్రమోషన్స్ ఆపేసినట్లుగా అనిపిస్తుంది. అంటే టక్ జగదీశ్ కూడా మోస్ట్లీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వెవ్ ఉధృతిలో సినిమా రిలీజ్ చేసి రిస్క్ చెయ్యడం కరెక్ట్ కాదేమో అనే ఆలోచనలో నాని టీం ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఉగాది ఈవెంట్స్ లోనూ నాని ఇంతకుముందే పాల్గొని టాక్ జగదీశ్ ప్రమోషన్స్ చేసేసాడు. ఈటివి ఉగాది ఈవెంట్, స్టార్ మా ఉగాది ఈవెంట్ లో నాని హీరోయిన్ రీతూ వర్మతో కలిసి తన సినిమాని ప్రమోట్ చేసాడు. ఇక మిగతా ప్రమోషన్స్ విషయంలో నాని అండ్ టీం మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది.
ఇప్పుడు నాని ఏం చేస్తాడు? సినిమా పోస్ట్ పోన్ చేస్తాడా? లేదంటే.. అంటూ అందరూ నాని వైపే చూస్తున్నారు.