గత శుక్రవారం థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ థియేటర్స్ దుమ్ముదులుపుతుంది. బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. గత మూడు నెలలుగా ఓ మాదిరి సినిమాలే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాయి. ఈ మూడు నెలల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రావడం ఇదే తొలిసారి కావడం, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో వకీల్ సాబ్ పై అందరిలో క్యూరియాసిటీ, అలాగే ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడ్డాయి. రిలీజ్ అయిన ఫస్ట్ షో కే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో వకీల్ సాబ్ వసూళ్ల పరంగాను అదరగొట్టేస్తుంది. వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 36 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.
ఇక అద్భుతంగా థియేటర్స్ లో దూసుకుపోతున్న వకీల్ సాబ్ ని చూడడానికి ప్రేక్షకులు కరోనని కూడా లెక్క చెయ్యకపోవడం గమనార్హం. కరోనా సెకండ్ వెవ్ ఉధృతంగా ఉన్న టైం లోను వకీల్ సాబ్ థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాకి రేట్లు పెంచకుండా ఇబ్బందులకు గురి చేసినా పవర్ స్టార్ ప్రభంజనం ఆగలేదు. ఇకపోతే ఇంత పెద్ద హిట్ అయిన వకీల్ సాబ్ ని అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకి దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి లాక్ డౌన్ లోనే అమెజాన్ వారు 100 కోట్ల ఆఫర్ ఇవ్వగా దిల్ రాజు మాత్రం వకీల్ సాబ్ ని ఎట్టి పరిస్తితుల్లో థియేటర్స్ లో విడుదల చేస్తామని పట్టుబట్టి బట్టి హిట్ కొట్టాడు.
తాజాగా అమెజాన్ ప్రైమ్ తో డీల్ పూర్తయిన వకీల్ సాబ్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని తెలుస్తోంది.