పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై జగన్ ప్రభుత్వం కక్ష గట్టింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి జగన్ ప్రభుత్వం భయపడింది. అందుకే కావాలని వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయించడం, టికెట్స్ రేట్లు పెరక్కుండా చర్యలు తీసుకోవడం చేసింది. పవన్ కున్న క్రేజు, ఇమేజ్ తో వకీల్ సాబ్ తో ప్రభంజనం సృష్టించడం ఖాయం. వకీల్ సాబ్ తో రికార్డులని కొల్లగొట్టడం ఖాయం అందుకే జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసి వకీల్ సాబ్ ని దెబ్బకొట్టింది. సామాన్యుల కడుపు కొట్టేలా టికెట్ రేట్లు పెంచడం ఏమిటి? సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం నాలుగు షోస్ కి మత్రమే అనుమతి ఉంది.. మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు అంటూ వైసిపి మంత్రి పేర్ని నాని నోటికొచ్చినట్లుగా మాట్లాడారు.
అయితే వకీల్ సాబ్ టికెట్ రేట్ల ఇష్యుపై డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద సినిమా గనక మొదటి మూడు రోజులు టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టు ని కోరగా.. కోర్టు వకీల్ సాబ్ థియేటర్స్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్స్ కి అనుకూలంగా తీర్పు నిచ్చింది. టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అంటూ తీర్పు నివ్వడమే కాదు.. ఏపీ లోని అన్ని జిల్లా కలెక్టర్స్‌కు, ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వగా.. ఏపీ ప్రభుత్వం హై కోర్టు డివిజన్ బెంచీ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
అయితే ఆ పిటిషన్ పై కూడా హై కోర్టు కీలక తీర్పునిస్తూ మొదటి రెండు రోజులు టికెట్ ధరలు పెంచుకోవచ్చు అంటూ తీర్పునిచ్చింది. మూడో రోజు బుక్ అయిన టికెట్స్ కాకుండా థియేటర్స్ దగ్గర ఇచ్చే టికెట్స్ మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఇవ్వాలని సూచించింది. అప్పట్నుంచి టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం లేదని చెప్పింది హై కోర్టు. దానితో థియేటర్స్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ పండగ చేసుకుంటుంటే, పవన్ ఫాన్స్ మాత్రం జగన్ మీద గెలిచిన పవన్ అంటూ మరింతగా రెచ్చిపోయి.. పండగ చేసుకుంటున్నారు.