Advertisementt

రష్మిక కల: నటన కాదు.. వేరే ఉందట

Sat 10th Apr 2021 10:37 PM
rashmika mandanna,tollywood top heroine,bollywood,dream,not acting,teaching,business  రష్మిక కల: నటన కాదు.. వేరే ఉందట
Rashmika dream: is not acting, but being different రష్మిక కల: నటన కాదు.. వేరే ఉందట
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ని కలిపి దున్నేస్తున్న రష్మిక మందన్న తెలుగు హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప పాన్ ఇండియా మూవీ తో పాటుగా.. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్న రష్మిక బాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాలు చేస్తుంది. అయితే చాలా తక్కువ సమయంలో స్టార్ డం ని సంపాదించిన రష్మిక కెరీర్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. రష్మిక అసలు హీరోయిన్ గా మారతానని , ఇంతగా బిజీ అవుతానని అనుకోలేదట. అసలు నటిగా మారతానని కలలో కూడా అనుకోలేదట. చాలామంది హీరోయిన్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను, లెక్చరర్ కాబోయి హీరోయిన్ అయ్యాను అని చెప్పినట్టుగానే.. 

రష్మిక కి ఒక కల ఉండేదట. అది టీచర్ అవ్వాలనే కల ఉండేదట రశ్మికకి. తాను మైసూర్ కాలేజీ రోజుల్లో చదివే టైం లో తనకి టీచర్ కావాలని కోరిక కలిగిందట. టీచర్ వృత్తిపై ఉన్న ఆసక్తితో సైకాలజీ, ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ కూడా పూర్తి చేసిందట. ఒకవేళ టీచర్ కాకపోయి ఉంటే గనక తన తండ్రి బిజినెస్ లను చూసుకుంటూ కాలం గడిపేద్దామనుకుందట. మరి ఇప్పుడు ఆ బిజినెస్ కానీ, టీచర్ ఊహలు కానీ రానంత బిజీగా మారిపోయింది రష్మిక. అందుకే తన జీవితాన్ని తిరిగి చూసుకుంటే.. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అని, అసలు ఊహించని జీవితంలోకి అడుగుపెట్టా అని.. అంతా విధి రాత అంటూ కబుర్లు చెబుతుంది రష్మిక. మరి నిజమే కదా. హీరోయిన్ గా గ్లామర్ గా ఉండడానికి.. రష్మిక వర్కౌట్స్, డైట్, షూటింగ్స్ అంటూ బిజీ లైఫ్ లోకి అడుగుపెట్టేసింది.

Rashmika dream: is not acting, but being different:

Rashmika Mandanna dream: is not acting, but being different

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ