బాలీవుడ్ లో కంగనా vs తాప్సి మధ్యన మాటల యుద్ధం తరుచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. కంగనా ఏమన్నా తాప్సి చూస్తూ ఊరుకోదు.. కౌంటర్ కి కౌంటర్ వేస్తుంటుంది. కంగనా కూడా తాప్సి ని బి గ్రేడ్ హీరోయిన్ అంటూ రెచ్చగొడుతుంటుంది. అయితే అంతటి ఎనిమీస్ ఇప్పుడు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం అందరిని ఆకర్షించింది. అంతేకాదు అందరికి షాకిచ్చింది కూడా. ఎప్పుడూ పాము ముంగిసలా పోట్లాడుకునే తాప్సి - కంగనాలు ఇప్పుడు ఒకరిని ఒకరు పొగుడుకుంటున్నారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు జరిగింది ఈ విచిత్రం అంటే.. తప్పడ్ సినిమాకి గాను ఉత్తమనటిగా ఫిలిం ఫేర్ సొంతం చేసుకున్న తాప్సి.. ఈమధ్యనే జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఆ అవార్డు ని స్వీకరిస్తూ.. తనతో పాటుగా ఉత్తమ నటి విభాగానికి నామినేట్ అయిన దీపికా పదుకొనే, కంగనా రనౌత్, జాన్వీ కపూర్, విద్యా బాలన్ లని పేరు పేరునా ప్రశంశించింది తాప్సి.
అద్భుతమైన ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసినందుకు కంగనాకు ప్రతేకంగా కృతఙ్ఞతలు చెప్పింది తాప్సి. అయితే ఆ వీడియో ని రీసెంట్ గా తాప్సి సాంఘీక మద్యమాల్లో షేర్ చేసింది. ఆ వీడియో చూసిన కంగనా.. ఎప్పుడూ తాప్సి మీద ఒంటి కాలుతో కస్సున లేచేది కాస్తా.. తాప్సి అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పడమే కాదు.. తాప్సి తనని ప్రశంసించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పింది. అంతేకాకుండా ఈ అవార్డు అందుకోవడానికి నీకన్నా అర్హులెవరూ కాదు అంటూ తాప్సి ని కంగనా పొగడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎప్పుడూ పిల్లి, ఎలుకలా కొట్టుకునే హీరోయిన్స్ ఇద్దరూ ఇలా ఒకరినొకరు పొగుడుకోవడం మాత్రం చాలా స్పెషల్ అంటే స్పెషల్ గా అనిపిస్తుంది.