జబర్దస్త్ లో అనసూయ గ్లామర్ కి యూత్ సలాం కొడుతోంది.. జబర్దస్ కి నేనే నెంబర్ వన్ అనుకున్న అనసూయ ఆ షో కొత్తలో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తన పారితోషకాన్ని పెంచేయగా.. మల్లెమాల నిర్మాతలు అనసూయ ని పక్కన పెట్టి ఆమె ప్లేస్ లోకి యాంకర్ రష్మిని తీసుకొచ్చారు. కొన్ని జబర్దస్త్ ఎపిసోడ్స్ కి అనసూయని త్పపించినా మళ్ళీ జబర్దస్ లోకి అనసూయని యాంకర్ గా రప్పించారు. అయినా కూడా రష్మిని పంపెయ్యకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉంచారు. అప్పటినుండి వచ్చిరాని తెలుగుతో చిట్టిపొట్టి డ్రెస్సులతో.. సుడిగాలి సుధీర్ తో లవ్ ఎఫ్ఫైర్ మేటర్ తో రష్మీ బాగా పాపులర్ అయ్యింది.
అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా బాగానే వెనకేసుకున్న రష్మీ అటు ఢీ డాన్స్ షో లోను యాంకర్ గా అదరగొట్టేస్తుంది. అవకాశం ఉన్నప్పుడు వెండితెర మీద అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. అయితే తాజాగా రష్మీ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతోంది అనే టాక్ మొదలైంది. గత ఏడేళ్లుగా జబర్దస్ యాంకర్ గా చక్రం తిప్పిన రష్మీ ఇప్పుడు పారితోషకం విషయంలో వచ్చిన విభేదాల కారణంగా జబర్దస్త్ ని వదిలెయ్యబోతుందట. గత ఏడేళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే పారితోషకం పెంచారట. మళ్ళీ మళ్ళీ పారితోషకం పెంచమని అడిగినా వారు స్పందించడం లేదట. దానితో రష్మీ జబర్దస్ ని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.