Advertisementt

ఎన్టీఆర్ నెక్స్ట్ పై మొదలైన ఉత్కంఠ

Sat 10th Apr 2021 09:55 AM
jr ntr,tarak,trivkram,ntr30,ntr next,ntr next director,rrr movie,pan india film  ఎన్టీఆర్ నెక్స్ట్ పై మొదలైన ఉత్కంఠ
NTR-Trivikram film NTR30 gets shelved ఎన్టీఆర్ నెక్స్ట్ పై మొదలైన ఉత్కంఠ
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ అలా వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తో జత కట్టడానికి రెడీ అయిపోయాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో NTR30 అనౌన్సమెంట్ వచ్చేసింది. మొన్న సంక్రాంతికి పూజా కార్యక్రమాలతో మొదలు కావాల్సిన NTR30 వాయిదా పడింది. అప్పుడే ఎక్కడో డౌట్ కొట్టినా.. ఈ కాంబో పై అందరిలో ఆసక్తి, అంచనాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో NTR30 ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ అటు తారక్ కూడా సైలెంట్ గా ఉండిపోయారు. మధ్యలోకి మహేష్ దూరాడు. త్రివిక్రమ్ - మహేష్ మూవీ సెట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ ఏమిటి అనే దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ చెయ్యడానికి టాప్ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీగా లేరు. అటు రామ్ చరణ్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా ఫిలిం చెయ్యబోతున్నాడు. ఇటు చూస్తే టాప్ డైరెక్టర్స్ అందరూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ. ఇలాంటి టైం లో ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు.. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫిలిం చేస్తాడా? లేదంటే నార్మల్ మూవీ చేస్తాడా? అనే దానిపై ఉత్కంఠ మొదలైంది. 

ఎన్టీఆర్ కోసం అటు తమిళ డైరెక్టర్స్ అట్లీ, ఇటు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లు ఉన్నా.. ప్రశాంత్ నీల్ సలార్ తో ఓ ఏడాది పాటు దొరకడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ప్లాన్స్ పై ఎన్టీఆర్ ఫాన్స్ లో గందర గోళం మొదలైంది. మరోపక్క ఎన్టీఆర్ బుల్లితెర మీద చెయ్యబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా పోస్ట్ పోన్ అవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి.

NTR-Trivikram film NTR30 gets shelved:

NTR film NTR 30 with Trivikram Srinivas shelved?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ