Advertisementt

హైదరాబాద్ లో చిల్ అవుతున్న లైగర్

Fri 09th Apr 2021 10:36 PM
vijay deverakonda,liger movie,mumbai,puri jagannadh,vijay liger,rowdy boy,happy boy,vijay devarakonda liger,rowdy star  హైదరాబాద్ లో చిల్ అవుతున్న లైగర్
A Happy boy Moment హైదరాబాద్ లో చిల్ అవుతున్న లైగర్
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినా.. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈమధ్యనే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో లైగర్ క్లయిమాక్స్ చిత్రీకరణ కంప్లీట్ చేసిన పూరి అండ్ విజయ్ లు ప్రస్తుతం ముంబై కి ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ కి వచ్చేసారు. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వీకెండ్ లాక్ డౌన్స్, నైట్ కర్ఫ్యూస్ తో చాలావరకు షూటింగ్స్ కూడా వాయిదాలు పడుతుండడంతో లైగర్ టీం మొత్తం హైదరాబాద్ కి వచ్చేసింది.

పూరి జగన్నాధ్ లైగర్ ఎడిటింగ్ లో బిజీగా ఉన్న పిక్ పోస్ట్ చేస్తే.. ఛార్మి తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటుంది. ఇక విజయ్ దేవరకొండ మాత్రం తన ఇంట్లో చిల్ అవుతున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి.. హ్యాపీ బోయ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇంకా లైగర్ లుక్ నే కంటిన్యూ చేస్తున్న విజయ్ దేవరకొండ షార్ట్ లో టీ షర్ట్ లో హ్యాపీ గా నవ్వుతూ కూర్చున్నాడు. ఆ వెనుకగా గోడ మీద విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన అర్జున్ రెడ్డి పిక్ ఒకటి కనిపిస్తుంది. మరి ప్రస్తుతం లైగర్ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న విజయ్ హైదరాబాద్ లోని తన ఇంట్లో హ్యాపీగా చిల్ అవుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A Happy boy Moment:

Vijay Deverakonda in a casual outfit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ